**శ్రీనివాస కళ్యాణం మరియు రథయాత్ర, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, ఫ్రీమాంట్, కాలిఫోర్నియా, అమెరికా**
Fremont Hindu Temple - Grand celestial wedding of Lord Balaji with Sridevi and Bhoodevi conducted in authentic manner by Veda Pandits with Live Nadaswaram (shahnai), shobhayatra and sumptuous Vivah Bhojan.
ఫ్రీమాంట్ హిందూ ఆలయం - శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ బాలాజీ స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం, వేద పండితులచే సంప్రదాయబద్ధంగా, ప్రత్యక్ష నాదస్వరం (షహనాయి) మరియు శోభాయాత్రతో పాటు విందు భోజనంతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
*Devotion is not just having darshan — it is also a practice to transform our mind, senses, and Guna-Karma! భక్తి కేవలం దర్శనం కాదు — మనసు, ఇంద్రియాలు, గుణకర్మలను మార్చుకునే సాధన కూడా!*
On Sunday, the grand festival of **Srinivasa Kalyanam** and **Rath Yatra** was took place at our temple in all its glory. This Kalyanam festival is not just a celebration; it is a symbol of the **divine union between the individual soul (Ātma) and the Supreme Being (Paramātma)**.
ఆదివారం నాడు, మా ఆలయంలో **శ్రీనివాస కళ్యాణం** మరియు **రథయాత్ర** మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కల్యాణ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు; ఇది **జీవాత్మ మరియు పరమాత్మల దివ్య సంయోగానికి** సంకేతం.
* **11 Senses Control Practice:** Spending these 2+ hours in divine contemplation is the first step toward breaking free from the slavery of our 11 senses (5 sensory organs + 5 action organs + mind), the Arishadvargas (6 inner enemies), and the Ashtavyasanas (8 bad vices). Divine contemplation means being immersed in divine thoughts, good actions, a mindset of service, and a pious atmosphere.
* **11 ఇంద్రియ నిగ్రహ సాధన:** భాగవద్చింతనలో గడిపే ఈ 2+ గంటల సమయం మన 11 ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు + మనస్సు), అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాల బానిసత్వం నుండి బయటపడటానికి మొదటి మెట్టు. భాగవద్చింతన - దైవిక ఆలోచనలు, సత్కార్యాలు, సేవా భావన మరియు ధార్మిక వాతావరణంలో ఉండటం.
* **Reducing Rajasic and Tamasic Influences and Moving Towards Sattva Guna:** Participating in such satsang, service, and devotional programs instead of wasting life’s time purely on worldly illusions, excessive entertainment, desires, and bad karmas is a useful practice. It is beneficial to spend time in divine service, staying away from nature's strict discipline (Panchabhuta punishment).
* **రజో, తమో గుణాల ప్రభావాన్ని తగ్గించి సత్త్వగుణం వైపు:** జీవిత సమయాన్ని కేవలం ప్రపంచపు మాయా ఆకర్షణలు, అధిక వినోదం, కోరికలు, చెడు కర్మలకు వెచ్చించకుండా ఇలాంటి సత్సంగం, సేవ, భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం ఉపయోగకరమైన సాధన. పంచభూతాల శిక్షణ కు దూరంగా భగవత్ సేవలో గడపడం శ్రేయస్కరం.
* **Sattvic Wedding Meal(Vivah Bhojan) (1:00 PM – 2:00 PM):** Consuming Sattvic food purifies the mind. By God's grace, this provides a divine opportunity to meet selfless devotees who walk the Sattvic path. However, we must observe them with a pure heart and respect, keeping a firm resolve within ourselves to walk toward Sattva Guna as well.
* **సాత్విక వివాహ భోజనం (మధ్యాహ్నం 1:00 - 2:00):** సాత్విక ఆహారం స్వీకరించడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. సాత్విక మార్గంలో పయనించే నిస్వార్థ భక్తులను కలిసే దివ్య అవకాశం భగవదనుగ్రహంతో లభిస్తుంది. అయితే వారిని స్వచ్ఛమైన మనసుతో, గౌరవంతో గమనిస్తూ, మనమూ సత్త్వగుణం వైపు నడవాలనే సంకల్పం ఉండాలి.
Our heartfelt thanks for the support and devotion of everyone participating in this **real seva**. Thanks for your presence at the Kalyanam and Rath Yatra!
రియల్ సేవలో భాగస్వాములవుతున్న మీ అందరి మద్దతుకు, భక్తికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కళ్యాణం మరియు రథయాత్రలో మీ అందరి సమక్షం కు ధన్యవాదాలు!
*Devotion should not remain only inside the temple — it must reflect in our thoughts, words, actions, families, and social service.*
*భక్తి కేవలం ఆలయంలో ఉండకూడదు — మన ఆలోచనల్లో, మాటల్లో, కర్మల్లో, కుటుంబంలో మరియు సమాజ సేవలో కనిపించాలి.*
*Welcome everyone to Sri Srinivasa Kalyanam & Rath Yatra! శ్రీనివాస కల్యాణం & రథయాత్రకు మీ అందరికీ స్వాగతం!*
*May Lord Sri Venkateswara's blessings be upon all! శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలి!*
*Govinda! Govinda! గోవిందా! గోవిందా!*
>City(s) = Fremont; State(s) = CA; Country = USA.
>Title = Srinivasa Kalyanam and Rath Yatra, San Francisco Bay area, Fremont, CA, USA - Video.
>Keywords = Srinivasa Kalyanam, Rath Yatra, San Francisco Bay area, Fremont, CA, USA, Fremont Hindu Temple (878)
>Catg =