Silicon Andhra is celebrating Sri Annamacharya Jayanthi Utsavalu during Memorial Day weekend (May 25th to 27th).
పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు, సిలికానాంధ్ర నాయకత్వములో, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం, మిల్పిటాస్, కాలీఫోర్నియా, అమెరికా(యు.ఎస్.ఏ)
అన్నమయ్య ఆణిముత్యాల పదాలు, ఎన్నో గొంతులతో సుమధుర గానాలుగా వెదజల్లుతుంటే, తెలుగు దేశాన ఉన్నామా అని ఓక అనుమానం వచ్చింది. అవును, తెలుగు వారితోనే ఉన్నాము, పులకించే భక్తి భావముతో వచ్చే, ఆ సుగంధపు వాసనలు తిరుపతి వి కావు, అమరావతి వీ కావు, భాగ్యనగరాని వి కూడా కావు. మరి ఎక్కడివి, ఇక్కడివే అమెరికా పశ్చిమాన కాలీఫోర్నియా లో ఉన్న మన తెలుగు సిలికానాంధ్రావి. మీరే చూసి ఆనందించండి చిత్రములు మరియు ద్రుశ్యములలో.
భావములోన బాహ్యమునందును, గోవింద గోవిందయని కొలువవో మనసా(శుద్ధ ధన్యాసి రాగం : ఆదితాళం), అనుకుంటూ అన్నమయ్య కమ్మని గీతాలు విందాము అని వెళ్ళితే, రధోత్సవం వైభవంగా జరుగుతుంది. శ్రావ్యముగా పాడుతూ కోలాటముతో చిన్నారులు ముందు ఉంటే, వెనక వెంకటేశ్వరుడు ప్రశాంతముగా చిరు మందహాసముతో ఇరువురు భార్యలతో కనుల పండుగగా విచ్చేయుచున్నారు.
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెనీ పాదము(ముఖారి రాగం : ఆదితాళం) అనుకుంటూ ఆయన పాదాలకు దండం పెట్టుకొని కమ్మటి గీతాలను వినడానికి కూర్చున్నాము అందరము. ఎన్నో తీయటి గొంతులు భక్తితో తన్మయత్వముతో ఇలా పాడుతున్నారు, కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని ,పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు (బ్రుందావని, మామామాళవగౌళ - మిశ్రచాపుతాలం). ఆహా ఏమి భాగ్యము ఈరోజు అనుకుంటున్నాము అందరము.
అన్నమయ్య గీతాలు దొరికితే అంతటితో ఊరుకుంటారా భక్తులు మరి, అంతలోనే అందుకున్నారు (మోహన రాగం ఆదితాళం) - కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా అని. కళ్ళ వెంట ధారలుగా కన్నీళ్ళు, ఆహా ఏమి భాగ్యము అనుకుంటూ, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు(హిందోళ రాగం : ఆదితాళం ) అయిన ఆ తండ్రిని తలచుకున్నాము.
నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో(బెహాగ్ రాగం : ఆదితాళం ), అంటూ ఇంకొక మధురమైన భక్తి తో, ఇంకో స్వరార్చన వీనుల విందుగా. అబ్బా ఆ భగవంతుని, బాల క్రిష్ణుడి గా కూడా తలచుకోవాలని మరి కొంత మంది , ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు(కురంజి రాగం : ఆదితాళం ) అంటూ శ్రావ్యముగా కీర్తించారు. అందరూ ఆ గానామ్రుతములో తన్మయత్వం పొందారు.
ఇలాంటి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, తెలుగు వారికి కనుల విందు చేస్తున్న, సిలికానాంధ్ర వారికి ధన్యవాదములు.
May 25th
8 AM - Rathotsavam, 9 AM - Saptagiri Sankeertana Goshti Ganam, 10AM - Ashtottara Sata Sankeertanachana, 1 PM - Lunch, 6 PM - Pallaki Seva, 6.30 PM - Annamayya Sankeertana Vibhavari, 8 PM - Pavalimpu Seva, 8.30 PM - Dinner
May 26th
8 AM to 5.30 PM - Music Competitions, 6 PM to 8 PM - Annamayya Sankeertana Vibhavari, 8 PM to 8.30 PM - Pavalimpu Seva, 8.30 PM - Dinner
May 27th
8 AM to 5.00 PM - Dance Competitions, 5 PM to 7 PM - Annamayya Sankeertana Vibhavari, 7 PM to 7.30 PM - Pavalimpu Seva, 7.30 PM - Dinner
University of Silicon Andhra, 1521 California Circle, Milpitas, CA, 95035.
>City(s) = Milpitas; State(s) = CA; Country = USA.
>Title = Sri Annamayya Jayanthi Utsavam by SiliconAndhra, Milpitas, CA, USA - Video.
>Keywords = Sri Annamayya Jayanthi Utsavam, SiliconAndhra, Milpitas, CA, USA (780)
>Catg =